సీఎంను విమర్శించే స్థాయి దినేశ్ రెడ్డికి ఉందా?: మంత్రి ఆనం
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ డీజీపీ దినేశ్ రెడ్డికి ఉందా? అని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, క్యాడర్ లో సీనియారిటీ ప్రకారం ఐదో స్థానంలో ఉన్న దినేశ్ రెడ్డిని డీజీపీని చేస్తే.. ఆయన సీఎంపైనే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. దినేశ్ రెడ్డి క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లి భంగపడ్డారని ఆయన గుర్తుచేశారు. నిబంధనలు, పద్ధతుల ప్రకారమే బదిలీలు, పదవీ విరమణలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.